Tuesday, November 26, 2024

ఏప్రిల్‌ ఫూల్‌ అనుకున్నా.. కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపుపై కేటీఆర్‌ ట్వీట్‌

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా తప్పుపడుతూనే ఉన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు గృ#హ వినియోగ సిలిండర్‌ ధరలను పెంచిన సమయంలోనూ కేటీఆర్‌ కేంద్రాన్ని తప్పుపడుతూ ట్వీట్‌ చేశారు. తాజాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధరల పెంపుపై కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ విమర్శించారు. డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర పెంచకపోవడం ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అని ఆశించామని ఎద్దేవా చేశారు. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ. 250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 2,253కు చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement