Tuesday, November 26, 2024

HZB By Poll: మూగబోయిన మైకులు.. అంతా గప్ చుప్!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. ఈ నెల30న జరగనున్నపోలింగ్‌ నేపథ్యంలో సైలెన్స్‌ పీరియడ్‌ అమలులోకి వచ్చింది. సెప్టెంబర్‌ 28న కేంద్ర ఎన్ని కల సంఘం హుజురాబాద్‌ ఎలక్షన్‌కు సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిననాటినుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. కరీంనగర్‌ కమిషనరేట్‌, వరంగల్‌ కమిష నరేట్‌ సంబంధించి కమలాపూర్‌ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్‌ పోస్టులు, 10 ప్లయింగ్‌ స్క్వాడ్‌, 5 ఎంసిసి, 10 వీఎస్టీలను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ. 3,29,36,830 నగదును, రూ. 6,36,052 విలువైన 944 లీటర్ల మద్యం, రూ. 69,750 విలు వైన 11.4 కేజిలు గంజాయిని, రూ.44,040 విలువైన పేలుడు పదార్థాలను, రూ. 2,21,000 విలువైన చీరలు, షర్ట్‌లను, రూ.10,60,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సీజర్‌ల విలువ రూ. 3,49,63,679 గా అధికారులు పేర్కొన్నారు.

ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న 2,284 మంది వ్యక్తులను గుర్తించి బైండోవర్‌ చేశారు. బైండోవర్‌ నియమావళి ఉల్లంఘించి మళ్ళీ నేరానికి పాల్పడిన ఎల్కపల్లి సంపత్‌ అనే వ్యక్తిని ఉల్లంఘన నేరం క్రింద అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇప్పటి వరకు ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రింద వివిధ పార్టీలపై 116 కేసులు నమోదు చెెయ గా, బుధవారం రాత్రి 7గంటలనుంచి ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement