Tuesday, January 28, 2025

HYDRAA – ఘట్ కేసర్ లో హైడ్రా పంజా – విద్యాసంస్థ నిర్మించిన కాంపౌండ్ వాల్ కూల్చి వేత

హైదరాబాద్ – ఘట్కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను హైడ్రా సిబ్బంది నేడు కూల్చివేశారు.. రెడీ అయ్యింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యనగర్‌లో నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. సర్వే చేసి హైడ్రా.. అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించి, కూల్చివేతలు నేటి ఉదయం ప్రారంభించింది.. ఇక్కడ లేఔట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీ గోడలను హైడ్రా కూల్చివేసింది.

ఇదిలా ఉండగా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటైందని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ గతంలో స్పష్టంచేశారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జులైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని కూడా హైడ్రా కూల్చలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement