Monday, November 18, 2024

HYDRAA – బీరంగూడ వంద‌న‌పురి కాల‌నీలో హైడ్రా బుల్డ‌జ‌ర్..

హైడ్రా అడుగులతో అమీన్పూర్ విలవిల…
అక్రమ నిర్మాణాలపై ఐడ్రా అధికారులు మరోసారి కన్నెర్ర చేశారు…
రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణం…
హైడ్రాలో ఫిర్యాదు చేసిన వందన పురి కాలనీవాసులు…
తెల్లవారుజామున హైడ్రా పంజా పూర్తిగా నేలమట్టం…

పటాన్ చేరు, నవంబర్ 18 (ప్రభ న్యూస్) అమీన్ పూర్ వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణంపై కొరడా ఝుళిపించింది. రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వేనెంబర్ 848లో రోడ్డుని ఆక్రమించి ఓ వ్యక్తి ఆక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ వాసులు హైడ్రాలో ఫిర్యాదు చేయడంతో సోమవారం తెల్లవారుజామున అధికారులు అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు.

వందనపురి కాలనీవాసులు ఎన్నిసార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో పట్టించుకోని అధికారులు ,నేరుగా వెళ్లి హైడ్రా ఆఫీస్ లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పూర్తిగా కబ్జా చేసిన నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.

- Advertisement -

ఇక ఈ కట్టడానికి నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయింది. భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు

వందనపురి కాలనీలో హైడ్రా చర్యలు..

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు చోట్ల అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ముందుగానే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి 15 రోజులు గడువు ఇస్తున్నారు. రెండు వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా రంగంలోకి దిగనుంది. ఎక్కడ అయినా ప్రభుత్వ భూములను, చెరువులు కుంటలు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోమారు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement