Monday, November 18, 2024

HYDRAA ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు – రేవంత్

హైదారాబాద్ – పర్యవరణాన్ని పునరుద్దరించడానికే హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ అన్న సీఎం రేవంత్… ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, కేరళ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదన్నారు. లేక్ సిటి .. ఫ్లడ్ సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. హైడ్రా వెనుక రాజకీయం లేద నీ, .. అలాగే తన స్వార్దం లేదన్న రేవంత్.. భూమాఫియా గాళ్లు పేదలను ముందు పెట్టి హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు..

:‘‘నేను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా’’ అని సీఎం ఉద్ఘాటించారు. . .. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని, విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని అన్నారు.

- Advertisement -

సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య బీజం వేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారన్నారు. ఈ సందర్భంగా నిజాంపై దాశరథి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు.ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం సముచితం. నాడు తెలంగాణ ప్రజల విజయం.. అందుకే ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నామని సీఎం చెప్పారు.

దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు. ఇది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇది మా పార్టీనో.. వ్యక్తిగతం కాదు.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి అని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు నియంత పాలన సాగింది. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంత పాలనను గద్దెదించామని రేవంత్ అన్నారు.

యువత ఆకాంక్షలు, అమరుల ఆశయాలు ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అంటే నా కుటుంబం గత పాలకులు భావించారు. నిజాంను మట్టి కరిపించిన భూమి తెలంగాణ. టీఎస్ నుంచి టీజీ కేవలం అక్షర మార్పు కాదు.. ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

.మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి అని రేవంత్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement