హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ పక్కన హైడ్రా పోలీస్ స్టేషన్ కార్యాలయ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేడు పరిశీలించారు. బుద్ధ భవన్‌లో హైడ్రా కార్యాలయం ఉంది. ఈ పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో బుద్ధ భవన్ పక్కనే ఉన్న భవనంలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ కేటాయించిన భవనాన్ని పరిశీలించిన అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్ తరహాలోనే లోపల గదులు, క్యాబిన్ల నిర్మాణాలు ఉండాలని సూచనలు చేశారు.
స్టేషన్ అధికారుల క్యాబిన్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై కూడా రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ సైన్ బోర్డులు బాగా కనిపించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూడాలని సూచన చేశారు.