Friday, November 22, 2024

HYDRAA – దుర్గం చెరువు ఆక్రమణలు కూల్చివేత‌ల‌పై హైకోర్టు స్టే

హైడ్రా నోటీస్ పై కోర్టులో పిటిష‌న్
అభ్యంతరాల‌తో లేక్ ప్రొట‌క్ష‌న్ కు విన‌తి ప‌త్రం
వాటిని ప‌రిశీలించాల‌ని కోర్టు ఆదేశం

తెలంగాణ హైకోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఈ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. దుర్గం సరస్సు ప్రాంత నిర్వాసితులు అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట హాజరుకావాలని పేర్కొన్న కోర్టు.. అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 4 నుంచి ఆరు వారాల్లోగా తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేసింది.

- Advertisement -

కాగా దుర్గం చెరువు ఆక్రమణ పరిధిలోని నివాసితుల్లో సీఎం సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తూ వస్తున్న హైడ్రా.. ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖుల నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు. దీంతో కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర వాసులకు ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement