Friday, December 6, 2024

HYDRAA – అల్వాల్ ఫంక్ష‌న్ హాలు కూల్చివేసిన హైడ్రా…

హైద‌రాబాద్ – అక్ర‌మ‌ణ చేసిన‌ట్లు ప్ర‌జ‌ల‌ను నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల‌పై హైడ్రా వెంట‌నే స్పందిస్తున్న‌ది.. ఆ ఫిర్యాదుల‌పై వాస్త‌వాల‌ను నిర్ధారించుకునేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ది.. అక్క‌డ అక్ర‌మ నిర్మాణ‌మ‌ని తేల‌తే ఆ వెంట‌నే వాటిని కూల్చివేస్తున్న‌ది.. తాజాగా ఆల్వాల్ లో స్థానికంగా ఉండే ప్ర‌జ‌లు ఒక ఫంక్ష‌న్ హాలు అక్రమ నిర్మాణంపై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని హైడ్రా సిబ్బంది పరిశీలించారు.. ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించి అక్కడ ఫంక్ష‌న్ హాలు క‌ట్టార‌ని నిర్ధారించారు.. నేటి ఉద‌యం అక్క‌డ‌కు బుల్ డోజ‌ర్తో వెళ్లిన హైడ్రా సిబ్బంది ఆ ఫంక్ష‌న్ హాలును కూల్చివేశారు.. ఆ స్థ‌లాన్ని స్వాధీనం చ‌సుకుని అక్క‌డ ఇది ప్ర‌భుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు.

అలాగే మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేసింది. కొన్ని ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఉదయం కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమంగా ఖాళీ స్థలంలో నిర్మించిన హద్దు గోడలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఇదిలాఉండగా, నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన తమకు ఫిర్యాదు చేస్తే దాన్నిపరిశీలించాక చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ప్రకటించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement