Sunday, December 29, 2024

HYDRAA – ప్ర‌జ‌ల‌కు, న‌గ‌రానికి మంచి చేసేందుకే హైడ్రా – క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

హైద‌రాబాద్ – న‌గ‌రానికి, ప్ర‌జ‌ల‌కు మంచి చేసేందుకే హైడ్రా ఏర్పడిద‌న్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. భూమి కొనుగోళ్ల‌లో, ఇళ్లు క‌ట్టుకునే వాటిలో ప్ర‌జ‌లు ఏ విధంగానూ మోస‌పోకూడ‌ద‌నే త‌మ ఉద్దేశ్య‌మ‌ని చెప్పారు. చెరువుల‌లో, కాలువ‌ల్లో, న‌ల్లాల‌పైనా క‌ట్ట‌డాలు నిర్మించి ప్ర‌జ‌ల‌ను అనేక‌మంది మోసం చేస్తున్నార‌ని, వాటిని అరిక‌ట్టేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.. దీనిలో భాగంగానే త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ . అలాగే ప్ర‌జ‌ల‌కు వేగ‌వంతంగా స‌మాచారం ఇచ్చేందుకు ఎఫ్ఎం రెడియో స్టేష‌న్ ను కూడా త్వ‌ర‌లో అందుబాటులోకి తెస్తామ‌న్నారు.. హైద‌రాబాద్ లోని ఆయ‌న కార్యాయంలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, త‌మ హైడ్రాకు ఛైర్మ‌న్ గాముఖ్య‌మంత్రి ఉంటార‌ని తెలిపారు… ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే త‌మ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతాయ‌ని అన్నారు..ప్రస్తుతం 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.

సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు , .. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. చెరువులు నింపి ఎఫ్టీఎల్ పరిధి మార్చినా కూడా.. వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు. అలాగే.. శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశం అవుతున్నామ‌ని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నామని తెలిపారు. వ్య‌క్తిగ‌తం కంటే ఒక గ్రూప్ ఉన్న వారు ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని రంగనాథ్ తెలిపారు.

- Advertisement -

కూల్చివేతల కోస‌మే హైడ్రా ఉన్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అది పూర్తిగా అవాస్త‌మ‌న్నారు. హైడ్రా చెరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. మరోవైపు 72 డీఆర్ఎఫ్ టీమ్‌లు అందుబాటులోకి రాబోతున్నాయ‌ని తెలిపారు రంగ‌నాథ్. . చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లపై డీఆర్ఎఫ్ పని చేస్తుందన్నారు. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతుంద‌న్నారు. .. ఇదిలా ఉంటే.. నోటరీ ఉన్న వాటిని కొనెప్పుడు ప్రజలు ఆలోచించాల‌ని సూచించారు… రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నోటిస్ ఇస్తే ఖాళీ చేయాల్సిందే ..

అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇళ్ళు, ప్లాట్స్ కొనే వారి కోసం.. బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. జూలై 19కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చద‌ని మ‌రోసారి తేల్చి చెప్పారు హైడ్రా చీఫ్.. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 8 చెరువులు, 12 పార్కులను 200 ఎకరాలు హైడ్రా కాపాడింద‌ని చెప్పారు. . 2025లో 12 చెరువులు హైడ్రా సుందరీకరించాలని టార్గెట్ పెట్టుకుందని రంగనాథ్ వివ‌రించారు. మరోవైపు.. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రాను వ్యతిరేకిస్తున్నార‌ని, .. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారని అన్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదని హైడ్రా కమిషనర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement