హైదరాబాద్ – నేడు ఆదివారం కావడం తో రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్ పల్లి, అమీన్ పూర్ లో కూల్చివేతలు చేపట్టింది. కూకట్ పల్లిలో నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు హైడ్రా అధికారులు.తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది… భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని..నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి.
నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్‌పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది.
అలాగే, అమీన్‌పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది