Saturday, September 21, 2024

Andhra Prabha Effect – కోకాపేటలో కూల్చివేతలు షురూ

హైదరాబాద్‌ – .జీవో 58 పేరుతో పంగనామాలు పేరుతో ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీనితో కోకాపేటలోని అక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేతలు చేపట్టారు అధికారులు . సర్వే నంబర్‌ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు స్థానిక అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.

నిరుపేదలపైనే బ్రహ్మస్ర్తం ..

ఇది ఇలా ఉంటే సర్వే నెంబర్ 147 లో తూ తూ మంత్రంగా కూల్చివేతల జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.. కొన్ని నిర్మాణాలు కోర్టు కేసులో ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు కొన్ని నిర్మాణాల జోలికి వెళ్లక పోవడం పలు అనుమానాలు తావు ఇస్తుంది. కౌన్సిలర్ల ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమితో పాటు 58 జీ ఓ పరిధిలోని భూ అక్రమణాలు సైతం అధికారులు వదిలి వేశారు.. కేవలం నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లను మాత్రమే కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement