Thursday, September 12, 2024

HYDRAA – పటాన్ చెరు సాకి చెరువులో 18 ఆక్రమణలు గుర్తింపు … హైడ్రా కమిషనర్ రంగనాథ్

సాకి చెరువును పరిశీలించిన రంగనాథ్ ..
చెరువులో 18 ఆక్రమణలు గుర్తింపు
తూములపై ఇన్ కోర్ సంస్థ అపార్ట్ మెంట్ నిర్మాణం
అందరికీ నోటీసులు..
అమీన్ పూర్ చెరువును పరిర‌క్షిస్తామ‌ని ప్ర‌క‌ట‌న

ప‌టాన్ చెరు – హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్‌చెరు ప్రాంతంలో నేడు పర్యటించారు. స్థానికంగా ఉన్న సాకి చెరువును ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో పరిశీలించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఆధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాకి చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం 18 అక్రమ నిర్మాణాలను గుర్తించామని తెలిపారు. ఇన్‌కోర్ సంస్థ ఏకంగా చెరువు తూమును పూర్తిగా పూడ్చి అపార్టుమెంట్‌ కట్టినట్లుగా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.. అలాగే అమీన్ చెరువు ఆక్రమణలపై సమగ్ర విచారణ జరుపుతున్నామని చెప్పారు.. ఇప్పటికే ఈ ప్రాంతవాసులకు నోటీసులు పంపామన్నారు..

- Advertisement -

జగన్‌కు నోటీసులపై క్లారిటీ …

మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందనే ప్రచారంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్లారిటీ ఇచ్చారు. సోషల్‌మీడియాలో వస్తున్న అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టి పడేశారు. ఎవరో కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement