Thursday, December 19, 2024

HYDRAA – ఈ ఏడాది జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం… రంగనాథ్

అంత‌కు ముందు నిర్మాణాల జోలికి పోము
తేల్చి చెప్పిన హైడ్రా కమిష‌న‌ర్ రంగ‌నాథ్
అనుమ‌తులంటే వారికి జోలికి వెళ్లం
చెరువుల్లో.. బఫర్ జోన్లలో.. ఎఫ్ టి ఎల్ జోన్ క‌ట్ట‌డాలు వ‌ద్దు
అక్క‌డ నిర్మాణాలుంటే కూల్చివేస్తాం
ప్ర‌తి సోమ‌వారం హైడ్రా కార్యాల‌యంలో ప్ర‌జావాణి
ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రిస్తాం

హైద‌రాబాద్ … అన్ని అనుమతులు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదని.. అలా కాకుండా చెరువుల్లో.. బఫర్ జోన్లలో.. ఎఫ్ టి ఎల్ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.


కూకట్ పల్లిలోని కాముని చెరువు, మైసమ్మ చెరువులను నేడు ఆయ‌న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2024 జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లబోమన్నారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటిని కూల్చబోమన్నారు.

పర్మిషన్లు తీసుకోకుండా అక్రమంగా నిర్మించుకున్న భవనాలపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుందన్నారు రంగనాథ్. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా వెళ్లబోదన్నారు. పేదవాళ్ల ఇండ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని చెప్పారు

- Advertisement -

ప్రతి సోమవారం ప్రజావాణి

హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. ఈ మేరకు 2025 జనవరి నుంచి ప్రతి సోమవారం బుద్ధభవన్‌ లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న‌ట్లు రంగ‌నాథ్ తెలిపారు.. చెరువులు,నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని అన్నారు. ఇటీవలే చెరువులు,నాలాలు, పార్కులు కబ్జాకు గురవుతున్నట్లు హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదులు వస్తున్నాయ‌ని, . ఈ క్రమంలోనే ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందకు ప్ర‌తి సోమవారం ప్ర‌జావాణిని నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement