ఆంధ్రప్రభ స్మార్ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోంది. ఇక్కడి ఖానాపూర్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఈ అక్రమ కట్టడాలు గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించారు. దీంతో దీంతో హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తెల్లవారుజామున నుండి కూల్చివేతలు చేపట్టారు. కాగా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతలలో ఎవరైనా అడ్డుగా వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కూల్చివేతలలో హైడ్రా అధికారులు, నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
HYDRAA Action – గండిపేట చెరువు ప్రాంతంలో ఆక్రమణలు కూల్చివేత
Advertisement
తాజా వార్తలు
Advertisement