Sunday, November 24, 2024

Singareni | ఆస్తుల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు..

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి ఆస్తులు, క్వార్టర్లను పరిరక్షించడం అందరి బాధ్యత అని సీఎండీ ఎన్‌.బలరామ్‌ చెప్పారు. దీన్ని కాపాడుకోవడానికి ప్రతీ ఒక్క ఉద్యోగి కృషి చేయాలన్నారు. సింగరేణి ఆస్తులు, క్వార్టర్ల పరిరక్షణకు హైడ్రా తరహా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం నుంచి జీఎం(విజిలెన్స్‌) ప్రసాదరావు, విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.

సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగ నియామక పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని సీఎండీ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. ఇందులో 272 ఎక్స్‌ టర్నల్‌ పోస్టుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును కూడా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన 327 పోస్టుల ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement