Saturday, November 16, 2024

HYDRA Report – ఇప్పటి వరకు కూల్చిన జాబితా ఇదే – హైడ్రా నివేదిక

హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్‌గా మారింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఈ హైడ్రా కూల్చి వేస్తున్నది.. ఈ క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. .హైడ్రా దూకుడుతో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైంది.

ఈ క్రమంలో గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది.ఈ రిపోర్టు ప్రకారం ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది.

ఇందులో పల్లంరాజు, సునీల్రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చి వేసినట్లు రిపోర్ట్‌లో తెలిపింది.

అలాగే లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో పలు నిర్మాణాలకు కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది.

- Advertisement -

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి. 18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక. పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు. 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా.

నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా.

లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా.

మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత.

ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత

మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా. గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత.

గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత.

బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత

చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా

నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత

నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement