Monday, November 18, 2024

HYDRA – అక్రమ కట్టడాలపై రంగనాథ్‌ ఉక్కుపాదం

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చందానగర్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేడు కూల్చివేస్తున్నారు.

వైశాలినగర్ లోని FTL ల్యాండ్ లో మూడు అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా… భారీ బిల్డింగ్ లను JCBలతో నేలమట్టం చేస్తోంది. నిన్నటి ఉదయం నుంచి మొదలైన కూల్చివేతలు..ఇవాళ సైతం కొనసాగుతున్నాయి. కూల్చివేత టైమ్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా , దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూమ్రుఖుద్దీన్‌ దవాళ్‌ చెరువులో అధికారుల నిర్లక్ష్యంతో బఫర్‌ జోన్లలో నిర్మాణాలు జోరందుకున్నాయి. దాదాపు 10 ఎకరాల చెరువు భూమిని కబ్జా చేసినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. మొత్తం 20 ప్రహరీలు, 6 నిర్మాణాలను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబిన్‌ కూల్చివేతలను నిలిపివేయాలని హైడ్రా సిబ్బందిని అడ్డుకోగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు

- Advertisement -

ట్రై సిటీ పరిధిలో చెరువులకు సంబంధించిన బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రియల్టర్లు, బిల్డర్ల నిర్మాణాలు అక్రమమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తాం. వారికి సహకరించే అధికారులపై కూడా చర్యలుంటాయి. చెరువులు, కుంటల సమీపంలో స్థిరాస్తులను కొనుగోలు చేసే ముందు ఓ సారి హైడ్రా కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది.– రంగనాథ్‌, హైడ్రా కమిషనర్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement