Tuesday, September 17, 2024

TG: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చునేందుకే హైడ్రా డ్రామా… ఎంపీ డీకే అరుణ

మక్తల్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే, తమ వైఫల్యాల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకు హైడ్రాకు తెరలేపారని పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే అరుణ అన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారని, అప్పుడు సక్రమమైనవన్నీ ఇప్పుడు అక్రమం ఎలా అవుతాయో ముఖ్యమంత్రి వెల్లడించాలన్నారు.

ఇవాళ నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో బీజేపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో వేయడం బాధాకరమని, ఆ కక్ష్య ఉంటే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, వారి కుటుంబంపైన చూపించాలి తప్ప… ఇతరులపై చూపించడం తగదన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని, అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు హైదరాబాద్ హైడ్రా డ్రామాలాడుతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు.

ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలని ఆమె ముఖ్యమంత్రికి సూచించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కింద పునరావాసం కల్పించాల్సిన గ్రామాల సమస్యలపై ముఖ్యమంత్రి రివ్యూ నిర్వహించి రోజులు గడుస్తున్నప్పటికీ అతీగతీ లేదన్నారు. వెంటనే పునరావాస సమస్యలు పరిష్కరించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు, నాయకులు కర్ని స్వామి, జి.ప్రసన్న బలరాం రెడ్డి, బాల్చేడ్ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement