Sunday, November 24, 2024

HYDRA – బాచుప‌ల్లి ఆక్ర‌మ‌ణ‌ల‌పై నేడు “హైడ్రా” పంజా…..

హైదరాబాద్‌: నగరంలో అక్రమ నిర్మాణాలపై ఐపిఎస్ అధికారి ఎవి రంగ‌నాథ్ సార‌ధ్యంలోని హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝలిపిస్తోంది. తాజాగా నేడు త‌న పంజాను బాచుప‌ల్లిపై విసిరింది. . హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాలలో బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

కాగా, నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో నగర శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్‌నగర్‌లలో హైడ్రా ఆధ్వర్యంలో గతవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. 329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

- Advertisement -

ఇక అమీన్ పూర్ , బీరంగూడ చెరువుల క‌బ్జాల‌పై ఆయ‌న దృష్టి సారించారు.. ఇప్ప‌టికే అమీన్ పూర్ లో క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించిన ఆయ‌న చెరువు ఆక్రమణ‌దారుల భ‌ర‌తం ప‌ట్టేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఈ వారంలో గాని, పై వారంలోగాని ఈ ప్రాంతంలోని అక్ర‌మ‌ణ‌లు తొల‌గించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement