హైడ్రా చట్టబద్దతను ప్రశ్నించిన పాల్
30రోజుల ముందే నోటీస్ ఇవ్వాలని వాదన
ప్రస్తుత దశలో ఏ ఆదేశాలు హైడ్రాకు ఇవ్వలేమన్న కోర్టు
విచారణ ఈ నెల 14 వ తేదికి వాయిదా
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని కోర్టులో కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు.
అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు. ఈ కేసులో ప్రతివాదులు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా వేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరించింది.
- Advertisement -