Saturday, September 14, 2024

HYDRA – ఆ ఫామ్ హౌజ్ కూల్చొద్దు … హైకోర్టులో రిట్ …

హైకోర్టును ఆశ్ర‌యించిన బిఆర్ఎస్ నేత
విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు
ఎఫ్‌టీఎల్‌ పరిధిలో తన ఫాంహౌస్ లేద‌ని వాద‌న

హైదరాబాద్‌: జన్వాడ ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బిఆర్ఎస్ నేత‌, యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, లేక్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సభ్యులు, శంకర్‌పల్లి తహసీల్దార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ను చేర్చారు. ఉస్మాన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో తన ఫాంహౌస్‌, పొలం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ”ఈ నెల 14న నా ఫాంహౌస్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఫాంహౌస్‌ లేదని ఆధారాలు చూపించాను. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మాణం ఉందని అధికారులు వాదించారు. 2019లో ఫాంహౌస్‌ను కొనుగోలు చేశాను. రాజకీయ కారణాలతో నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారు” అని ప్రదీప్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.

- Advertisement -

అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం ఏమిటి?: హైకోర్టు..

జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 – 20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది.
చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్‌లను నీటి పారుదల శాఖ చూస్తోందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు మాత్రం లేదని ఏఏజీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement