Saturday, November 23, 2024

జీ తెలుగులో సంక్రాంతికి కేరళలో తెలుగు అల్లుళ్లు, బంగార్రాజు

సంక్రాంతి అనగానే భోగి మంటలు, కొత్త దుస్తులు, కనుమ పండుగ, హరిదాసులు, అత్త గారింటికి వచ్చే అల్లుళ్లు ఇవే కదా అందరికీ గుర్తుకు వచ్చేది! ఏడాదిలో మొదటి పండుగ సంక్రాంతిని గ్రాండ్‌గా చేసుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. తెలుగు ప్రేక్షకుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు, వైవిధ్య భరిత కార్యక్రమాలను అందిస్తున్న ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలను దాటి కేరళకు వెళ్లింది. ఫుడ్ బౌల్ ఆఫ్ సౌత్, గాడ్స్ ఓన్ కంట్రీ గా ప్రఖ్యాతి చెందిన కేరళ సౌందర్యాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించనుంది.

కేరళలో జీ కుటుంబ సభ్యులు చేసుకుంటున్న సంక్రాంతి పండుగ వేడుకలను తనదైన శైలిలో ప్రియమైన అభిమానుల ముందుకు తేనుంది జీ తెలుగు. ఇందులో డ్యాన్స్‌లు, కామెడీ స్కిట్‌లు, మ్యూజిక్‌తో సహా అన్ని ఈవెంట్లు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఈ సంక్రాంతికి మీ అభిమాన తారలు చేసిన సందడి చూడడానికి సిద్ధంగా ఉండండి. 13, 14వ తేదీల్లో రెండు విభాగాలుగా ఈ వేడుకను ఛానల్ ప్రసారం చేయనుంది. వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీలు, వినోదంతో కూడిన వేడుకలకు మరింత సందడి తీసుకువచ్చారు. జనవరి 13 ఉదయం 9 గంటలకు ‘కేరళలో సంక్రాంతి అల్లుళ్ల సందడి’ మన జీ తెలుగు ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతుంది. జనవరి 14వ తేదీన ప్రసారమయ్యే రెండో భాగం ‘బంగార్రాజు’ టీంతో అనగా సూపర్ స్టార్లు నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టితో సహా పలువురు నటులు కనిపించనున్నారు.‘బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు’ జనవరి 14 ఉదయం 9 గంటలకు ప్రారంభమై మూడు గంటల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచి పెడుతుంది. పండుగ సంతోషానికి మరింత వినోదాన్ని అందించే జీ కుటుంబం సభ్యులు, నటుల సంక్రాంతి వేడుకలను చూసేందుకు మీ జీ తెలుగు ఛానెల్‌ను 13, 14వ తేదీల్లో ఉదయం 9 గంటలకు తప్పక వీక్షించండని జీ తెలుగు కోరుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement