హైదరాబాద్ – తెలంగాణలో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ షర్మిల తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.. ఖమ్మం జిల్లా నేతలు, కార్యకర్తలు ,అభిమానులతో షర్మిల నేడు లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ ఆర్ కి పులివెందుల ఎలాగో తనకు పాలేరు కూడా అలాగేనని చెప్పారు.. అలాగే వచ్చే నెల తొమ్మిదో తేదిన ఖమ్మంలో తలపెట్టిన ఆవిర్భావ సభపై కూడా వారితో చర్చించారు.. సభ నిర్వహించే గ్రౌండ్ కు ఇప్పటికే పోలీసులు అనుమతి ఇచ్చారని, అయితే సభ నిర్వహణకు మాత్రం ఇంతవరకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి రాలేదని ఖమ్మం నేతలు షర్మిల దృష్టికి తెచ్చారు..కరోనా ఉదృతి నేపథ్యంలో సభ నిర్వహణకు అనుమతుల రాకపోవచ్చనే సందేహాలు వెలిబుచ్చారు.. అయితే వాటన్నింటిని తోసిపుచ్చిన షర్మిల ఎన్ని అవరోధాలు ఎదురైనా సభ నిర్వహిస్తామని తేల్చేశారు.. సభ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement