హైదరాబాద్, మే 2 (ప్రభ న్యూస్) : ఇండియా యమహా మోటర్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్ తమ నూతన బ్లూ స్క్వేర్ ఔట్లెట్లను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్ షోరూమ్‌లను అత్తాపూర్‌లో ఏస్ మోటర్స్ పేరుతో (2700 చదరపు అడుగుల విస్తీర్ణం), ఆర్సీ పురంలో రాఘవేంద్ర మోటర్స్ (1475 చదరపు అడుగులు) పేరిట సమగ్రమైన సేల్స్, సేవలు, స్పేర్స్ మద్దతు అందించే రీతిలో ప్రారంభించారు. భారతదేశవ్యాప్తంగా బ్లూ స్క్వేర్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, కంపెనీ విలువలతో వినియోగదారులు అనుసంధానించబడేందుకు ఓ వేదికను అందించడం.
అలాగే బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడాన్ని వారు గర్వంగా భావించేలా అనుభూతులనూ కలిగించడం. నూతనంగా ప్రారంభించిన ఔట్లెట్లతో యమహా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది బ్లూ స్క్వేర్ ఔట్లెట్లను నిర్వహిస్తుంది. మొత్తంమ్మీద భారతదేశంలో 180 బ్లూ స్క్వేర్ షోరూమ్‌లను తమిళనాడు, పాండిశ్చేరి, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, అస్సాం, ఛత్తీస్‌ఘడ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ, రాజస్తాన్, ఇతర ఈశాన్య రాష్ట్రాలలో నిర్వహిస్తుంది.