Friday, November 22, 2024

బహుళ ప్రాంతీయ కథనాల్లో పనిచేసేందుకు ఇష్టపడతాను… వరుణ్ బడోలా

హైదరాబాద్ : తాను బహుళ ప్రాంతీయ కథనాల్లో పనిచేసేందుకు ఇష్టపడతానని ప్రముఖ నటుడు వరుణ్ బడోలా తెలిపారు. జీ థియేటర్ రాంగ్ టర్న్ లో లేయర్డ్ క్యారెక్టర్‌ను పోషించిన నటుడు ఇప్పుడు ఈ టెలిప్లే తెలుగులోకి అనువదించబడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టెలిప్లేలో లేయర్డ్ క్యారెక్టర్‌ని పోషిస్తున్న వరుణ్ బడోలా ఇప్పుడు రాంగ్ టర్న్ ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుందని సంతోషంగా వెల్లడించారు. డబ్బింగ్, సబ్‌టైటిలింగ్, అనువాదాల వల్ల బహుభాషా కథలు గతంలో కంటే ఎక్కువ మందికి చేరుతున్నాయన్నారు. రెండు తమిళ యాడ్ ఫిల్మ్‌లు చేసాను, కానీ నటుడిగా, తాను ఈ మార్పులో భాగం కావాలని ఎదురు చూస్తున్నానన్నారు. మరెన్నో ప్రాంతీయ కథనాల్లో పని చేయడానికి ఇష్టపడతానని ఆయన వెల్లడించారు.

వివిధ భాషల్లో వీక్షించే అవకాశం కలగటం మాత్రమే కాదు, సుసంపన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుందన్నారు. భాషా అవరోధాన్ని కూడా ఛేదిస్తుందన్నారు. ఓటీటీ చాలా మంది అద్భుతమైన ప్రాంతీయ నటులను మనకు పరిచయం చేసిందన్నారు. ఇప్పుడు రాంగ్ టర్న్ ద్వారా తెలంగాణలోని ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారని అన్నారు. రాంగ్ టర్న్ సెప్టెంబర్ 16న తెలుగులో డిష్ టీవీ అండ్ డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్, ఎయిర్‌టెల్ థియేటర్‌లో ప్రసారం చేయబడుతుందన్నారు. ఈ నాటకంలో గోవింద్ నామ్‌దేవ్, లలిత్ తివారీ, సునీల్ సిన్హా, లిలిపుట్ ఫరూకీ, సుజానే ముఖర్జీ, అనంగ్షా బిస్వాస్, షాలినీ శర్మ, నీరజ్ సాహ్ కూడా నటించారు. దీనికి రంజిత్ కపూర్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement