Tuesday, November 26, 2024

అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్సవం

హైదరాబాద్ న‌గ‌రంలోని మల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన అమోర్ హాస్పిటల్స్ ఈరోజు ‘వరల్డ్ నో టొబాకో డే’ ను పురస్క రించుకొని కూకట్‌పల్లి ప్రాంతంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. చెన్నై సిల్క్స్ (కూకట్ పల్లి), కుమరన్ తంగమలైగై జ్యువెలర్స్ (మెహిదీపట్నం) ఉద్యోగులతో కలిసి ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్, సహాయక సిబ్బంది కవాతులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి అమోర్ ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ… పొగాకు నుంచి వెలువడే నికోటిన్ మెదడులోని రసాయనం డోపామైన్ విడుదలను ప్రేరేపిస్తుందన్నారు. ధూమపానం చేస్తున్న వ్యక్తికి తక్షణ ఆనందాన్ని ఇస్తుందన్నారు. కానీ ఈ తక్షణ ఆనందం వ్యక్తికి, అతని కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య విపత్తుగా మారుతుందన్నారు. అమోర్ ఆస్ప‌త్రిలో తాము సమాజ శ్రేయస్సును విశ్వసిస్తామన్నారు. తమ ప్రయత్నాలన్నీ, వారి ఆరోగ్యంపై మానవ తప్పిదాలు క‌లిగించే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే దిశగా ఉంటాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement