కర్మన్ ఘాట్, ఆగస్టు 18 (ప్రభ న్యూస్) : అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని హస్తినాపురం కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని అగ్రికల్చర్ కాలనీలో శుక్రవారం కార్పొరేటర్ భానోత్ సుజాత నాయక్ పర్యటించి అక్కడ సుమారు కోటి రెండు లక్షలతో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అసిస్టెంట్ ఇంజనీర్ హేము నాయక్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ… కాలనీలో మిగిలి ఉన్న రోడ్లలో సీసీ రోడ్లు బీటీ రోడ్లు మంజూరయ్యేలా కృషి చేయాలని కార్పొరేటర్ ని కాలనీవాసులు కోరారు. స్పందించిన కార్పొరేటర్ మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసి నిధులతో రోడ్లకు అవసరమయ్యే నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర మహీపాల్ రెడ్డి, పి ఎస్ ఆర్ శర్మ బాలకృష్ణారెడ్డి, నాగరాజు, మెగా రెడ్డి, జితేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, తివారి, రాము, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మమతా మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.