హైదరాబాద్ : హోలీ వేడుకల సందర్భంగా ఈ నెల 28వ తేది సాయంత్రం నుంచి 36 గంటల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆ రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాల్సిందిగాద హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. అలాగే ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement