Friday, November 22, 2024

TS | త‌ప్పు చేయ‌న‌ప్పుడు బ‌యమెందుకు.. కవిత అరెస్ట్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయ‌ప్పుడు కవిత‌కు భ‌యం ఎందుకు అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని ఆయన సూచించారు. బీఆర్‌ఎస్‌పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళు విచారణకు సహకరించకుండా కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, నేను మహిళను అని చెప్పి మరికొన్ని రోజులు కవిత తప్పించుకుని తిరిగారని అయన‌ అన్నారు. విచారణకు సహకరించ లేదు కాబట్టే.. ఈడీనే ఆమె ఇంటికి వెళ్ళిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement