హైదరాబాద్ – ఉస్మానియా యూనివర్సిటీ అభ్యున్నతికి నూతన వైస్ ఛాన్స్లర్ రవీందర్ కృషి చేయగలరని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విసిగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ ను యూనివర్సిటీ క్యాంపస్ లో కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు విప్ బాల్క సుమన్ . అనంతరం మాట్లాడుతూ ప్రొఫెసర్ రవీందర్ గతంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ గా, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించార నీ ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ అభ్యున్నతికి కృషి చేస్తారని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement