హైదరాబాద్ : భారతదేశంలో గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ (మార్చి 2024 నుండి మార్చి 2025 వరకు) గా వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ గుర్తింపు పొందింది వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్. అసాధారణమైన ట్రస్ట్ ఇండెక్స్ గ్రాండ్ మీన్ స్కోర్ 96శాతంను పొందింది. ఉద్యోగుల భావోద్వేగ సెంటిమెంట్‌ను క్యాప్చర్ చేసే ఓవర్‌రైడింగ్ సెంటిమెంట్ స్కోర్‌ను (ప్రతిదీ పరిగణనలోకి తీసుకుంటే, డబ్ల్యూఎల్ఎల్ పని చేయడానికి గొప్ప ప్రదేశం అని నేను చెబుతాను.) 97శాతం పొందింది.
గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనేది వర్క్‌ప్లేస్ కల్చర్‌పై గ్లోబల్ అథారిటీ. 1992 నుండి, వారు ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను సర్వే చేశారు. గ్రేట్ వర్క్ ప్లేస్ : ట్రస్ట్ గా నిర్వచించడానికి ఆ లోతైన పరిజ్ఙానంను ఉపయోగించారు. ఈ సందర్భంగా డబ్ల్యూఎల్ఎల్ సీఈఓ అండ్ ఎండి దిపాలి గోయెంకా మాట్లాడుతూ…. ఈ గుర్తింపు తమకు లభించినందుకు తాను చాలా గర్వపడుతున్నానన్నారు. డబ్ల్యూఎల్ఎల్ అంతటా మా బృందాల కృషి, నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. డబ్ల్యూఎల్ఎల్ వద్ద సంస్కృతి అనేది అన్ని సమయాల్లో మన ప్రవర్తనను నడిపించే వెన్నెముక అన్నారు.
ఈ అంశమే తమ టీమ్‌ల జీవితాలను తాకినందుకు, వారి నడుమ ప్రతిధ్వనించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. మనం ముందుకు వెళ్లేందుకు మార్గదర్శకంగా మన సంస్కృతి కొనసాగుతుందని, దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.