హైదరాబాద్ : హోమ్ టెక్స్‌టైల్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్, 2023 కోసం తమ తాజా ఎస్ అండ్ పీ గ్లోబల్ – కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ (సీఎస్ఏ) స్కోర్‌లను ప్రకటించింది. ఈసందర్భంగా వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎండి దీపాలి గోయెంకా మాట్లాడుతూ… డబ్ల్యూఎల్ఎల్ వద్ద తాము చేసే ప్రతి అంశంలోనూ ఈఎస్జీ ప్రధానమైనదన్నారు. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఈఎస్జీ స్కోర్‌లలో గణనీయమైన మెరుగుదల తమ ప్రయత్నాలకు నిదర్శనమన్నారు.
టెక్స్‌టైల్, దుస్తులు అండ్ లగ్జరీ వస్తువుల విభాగంలో భారతదేశం నుండి అత్యధిక రేటింగ్ పొందిన కంపెనీ కావడం పర్యావరణ సారథ్యం, సామాజిక బాధ్యత, పారదర్శక పాలనలో పరిశ్రమను నడిపించాలనే తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు. వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ సిఎఫ్ఓ సంజయ్ గుప్తా మాట్లాడుతూ… అన్ని రంగాలలో తమ మెరుగైన స్కోర్లు సస్టైనబిలిటీ పట్ల తమ సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, కమ్యూనిటీలను ఉద్ధరించడానికి తమ సమిష్టి ప్రయత్నాలతో ఇది సాధ్యమవుతుందన్నారు.