హైదరాబాద్ : వెల్స్పన్ గ్రూప్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమం ద్వారా, చేవెళ్ల మండలం పామెన గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి పీఎంఆర్ హాస్పిటల్స్‌తో చేతులు కలిపింది. గ్రామస్థులకు సమగ్ర వైద్యసేవలు అందించడమే దీని లక్ష్యం. ఈ భారీ ఆరోగ్య శిబిరాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వైద్య సహాయం కోరిన 198 మంది గ్రామస్తులకు వైద్య బృందం చేసిన సేవలు ఎనలేనివి. ఈసందర్భంగా పామెన గ్రామ సర్పంచ్ అక్నాపురం మల్లారెడ్డి తన కృతజ్ఞతలు తెలుపుతూ అట్టడుగు స్థాయి ఆరోగ్య సంరక్షణ రంగంలో వెల్స్పన్ ఫౌండేషన్, పీఎంఆర్ హాస్పిటల్స్ చేస్తున్న ప్రశంసనీయమైన పనిని అభినందించారు.
ఆయన మాట్లాడుతూ… అవసరంలో ఉన్న వారికి వారి ఇంటి వద్దనే మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అంకితమైనటువంటి నిబద్ధత కలిగిన సంస్థల మద్దతును తాము కలిగి ఉండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా వారు అందించటం ద్వారా సమాజాన్ని శక్తివంతం చేస్తున్నారన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ పట్ల వెల్స్పన్ ప్రతినిధి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఫౌండేషన్ అంకితభావాన్ని నొక్కిచెప్పారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించడం కమ్యూనిటీల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగు పరచడంలో తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పీఎంఆర్ హాస్పిటల్స్ వంటి భాగస్వాములతో తాము చేతులు కలపడం ద్వారా సృష్టించగల సానుకూల ప్రభావాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు.