Monday, November 25, 2024

ప‌త్తి రైతులకు అధిక ఆదాయం అందించ‌డ‌మే వెల్‌స్పన్‌ ఫౌండేషన్ ల‌క్ష్యం

హైదరాబాద్‌, మే 9 (ప్ర‌భ న్యూస్) : ప‌త్తి రైతుల‌కు మెరుగైన ఆదాయం అందించ‌డ‌మే వెల్‌స్పన్‌ ఫౌండేషన్ ల‌క్ష్యం. అందులో భాగంగా వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యుఎఫ్‌) రంగారెడ్డి జిల్లాలోని రైతుల కోసం బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ (బీసీఐ) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్ధిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభించారు. అలాగే డబ్ల్యుఎఫ్‌కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్యుఎఫ్‌ ఇప్పుడు రైతులతో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుంది. ఈ సంవత్సర కార్యక్రమాలలో భాగంగా 77 మట్టి నమూనాలను 38 గ్రామాల నుంచి సేకరించారు. అత్యధికంగా నమూనాలను చేవెళ్ల తాలూకా నుంచి సేకరించారు. మొత్తం 24 గ్రామాల నుంచి 50 నమూనాలు వీటిలో ఉన్నాయి. ఈ భూసార పరీక్షల వల్ల రైతులు సరైన రీతిలో ఎరువులు వాడటంతో పాటుగా భూసారాన్నీ మెరుగుపరుచుకోగలిగారు.

ఈసంద‌ర్భంగా వెల్‌స్పన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల, సమ్మిళిత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను రైతులు స్వీకరించే నైపుణ్యం, విజ్ఞానాన్ని అందించే దిశగా ప్రారంభించిన కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని త‌మ బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్ అన్నారు. ఈ ప్రాంతంలో పత్తిపంట రైతుల జీవనోపాధి అవకాశాలను మెరుగు పరచడంలో తోడ్పాటునందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు మాట్లాడుతూ… ఈ ప్రాంతంలోని రైతులు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరించారన్నారు. త‌మ గ్రామంలో బీసీఐ ప్రాజెక్ట్‌ను డబ్ల్యుఎఫ్‌ పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. స్ధిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల తామెంతగానో నేర్చుకున్నామన్నారు. తద్వారా త‌మ పంట నాణ్యత కూడా మెరుగుపడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement