తాజా ధోరణుల కోసం భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ కేంద్రం లైఫ్‌స్టైల్ తమ తాజా ప్రచారంను ఫేమ్ ఫరెవర్ కోసం ప్రారంభించింది. ‘వియర్ ఇట్. పెయిర్ ఇట్.ఎనీవేర్ ఇట్’ శీర్షికన దీనిని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా లైఫ్‌స్టైల్ సీఈఓ దేవరాజన్ అయ్యర్ మాట్లాడుతూ… ఫ్రేమ్ ఫరెవర్ బై లైఫ్‌స్టైల్ నుంచి నూతన కలెక్షన్ విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ కలెక్షన్‌ను మావినియోగదారుల సౌకర్యం, విలువ కోరుకునే విధానం దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దామన్నారు. ఈ కలెక్షన్లో ప్రతిఒక్కరికీ ఒకటి ఉందన్నారు. అత్యంత సంతోషకరమైన ధరల వద్ద ఇవి ఒకే చోట లభిస్తాయన్నారు. తమ వినియోగదారులు ఈ కలెక్షన్‌ను అన్వేషించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది విభిన్న మార్గాల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో పాటుగా కష్టపడకుండానే స్టైలింగ్ చేసుకోవచ్చని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement