Tuesday, November 19, 2024

తెలంగాణ కోసం పోరాడిన అమరుల త్యాగాల స్మరించుకోవాలి.. సబితా ఇంద్రారెడ్డి

బాలాపూర్: తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరుల త్యాగాల స్మరించుకోవాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమీకృత వజ్రోత్సవాల భాగంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి బడంగ్పేట్ కార్పొరేషన్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ వరకు పదివేల మందికి పైగా విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కప్పాటి పాండురంగారెడ్డి, ఏసీపీ పురుషోత్తం రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ రావు, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, మీర్పేట్ మేయర్ దుర్గదీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రం శేఖర్, తీగల విక్రమ్ రెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణ చేయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రోజును పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమీకృత వజ్రోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందన్నారు. మొదటిరోజు అన్ని సంఘాలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే మీర్పేట్ నుండి బడంగ్పేట్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వర్కర్స్, అధికారులందరి సహకారంతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. 17వ తేదీన అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని, 18న కవులు కళాకారులను సన్మానించుకోవాలని తెలిపారన్నారు. గిరిజన ఆదివాసులకు బంజారాహిల్స్ లో 53 కోట్లతో రెండు భవనాలు నిర్మించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement