హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. పటాన్‌చెరు జంక్షన్ పనుల వల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది. మరమ్మతు పనుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
ఈ ప్రాంతాలకు అంతరాయం..
బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరు టౌన్, రామచంద్రాపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట, డోయెన్స్ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాలకు మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది.
కాగా, వాటర్ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జలమండలి కోరింది. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.