జీహెచ్ఎంసీ పరిధిలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలపై జలమండలి అధికారులకు బీజేపీ కార్పొరేటర్లు వినతిపత్రం అందజేశారు. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ… ప్రభుత్వానికి బార్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదన్నారు.ఎవరిని సంప్రదించి వాటర్ వర్క్స్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేశారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ కు సమన్వయం లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులుంటాయన్నారు. త్రాగు నీటిలో డ్రైనేజీ నీరు కలుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. పాలాభిషేకాలు చేయించుకోవటం కాదు.. మంత్రి కేటీఆర్ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. కార్పోరేటర్లుగా గెలిచి ఏమి చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారన్నారు. అధికారులు తక్షణమే నీటి సమస్య, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital