హైదరాబాద్: .నగరంలోని ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ మరి కొద్దిసేపటిలో ప్రారంభించనున్నారు దీంతో . హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మధ్య పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు
. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌రోడ్ వైపు ట్రాఫిక్‌ను అమతించారు. దీంతో కట్టమైసమ్మ దేవాలయం వద్ద లోయర్ ట్యాంక్‌బండ్, ఎమ్మార్వో ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, ఇందిరాపార్క్ ఎక్స్‌రోడ్డు వైపు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించనున్నారు. ఇందిరాపార్కు ఎక్స్ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మంగ్ పూల్, తహసీల్దార్ ఆఫీసు, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను మళ్లిస్తారు.
హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి శాశ్వత విముక్తి కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికలో (ఎస్ఆర్డీపీ) భాగంగా ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ క్రాస్ రోడ్ వరకు నిర్మించిన స్టీల్ ఫ్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి శ్రీ @KTRBRS… pic.twitter.com/lqlFktyHxC
— BRS Party (@BRSparty) August 19, 2023