Wednesday, November 20, 2024

Viveka Case – ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డి .. వ‌చ్చే 14న కోర్టు కు రావాల‌సిందిగా స‌మ‌న్లు..

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో క‌డ‌ప ఎంపి అవినాష్‌రెడ్డి ని ఆగ‌స్ట్ 14న హాజ‌రుకావాల‌సిందిగా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. కాగా, అవినాష్ రెడ్డి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. ఆగస్టు 14న కోర్టులో హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో ఆరు, ఏడో నిందితులుగా భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఏప్రిల్‌ 14న ఉదయ్‌ కుమార్‌రెడ్డిని, 16న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేడు సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులందరూ హాజరయ్యారు. వారందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యే విధంగా చూడాల్సిన బాధ్యతను న్యాయస్థానం సీబీఐకే అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement