హైదరాబాద్: బేగంపేట్ విన్ హాస్పిటల్ యాజమాన్యం బరి తెగించింది.. అవసరం లేకపోయినా రోగికి పలు పరీక్షలు చేసి భారీగా బిల్లు వడ్డించింది.. దానిని కట్టకపోవడంతో గత 20 రోజులుగా హాస్పటల్లోనే అతడిని నిర్భంధించింది.. వివరాలలోకి వెళితే అల్వాల్‌కి చెందిన రామారావు కోవిడ్ పాజిటివ్‌తో ఏప్రిల్ 1వ తేదీన ఆసుపత్రిలో ఆయన చేరారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడంతో చికిత్స అయ్యే ఖర్చు మొత్తం తామే హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటాం అని హామీ ఇచ్చింది యాజమాన్యం.. కోవిడ్ కోసం అడ్మిట్ అయితే, వైద్యులు అనవసరమైన టెస్ట్‌లు చేసి నాలుగు లక్షల బిల్లు వేశారు. పరీక్షలు చేయకుండా చేసినట్లు రిపోర్ట్‌లో ఉండడంతో ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ను తిరస్కరించింది. దీంతో నాలుగు లక్షలు కట్టే వరకు డిశ్చార్జ్ చేసేది లేదని హాస్పిటల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో 20 రోజుల నుంచి డిశ్చార్జ్ చేయకుండా అతడిని హాస్పిటల్‌లో బంధించారు. రామారావుకు గుండె జబ్బు ఉందని, బెడ్ ఇవ్వాలని రోగి బంధువులు యాజమాన్యాన్ని ప్రాధేయపడిన కనికరించలేదు. దీంతో వారు మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగంలోకి దిగి దీనిపై విచారణ జరుపుతున్నారు.. తమ కుటుంబ సభ్యుడు రామారావుని బంధించిన హాస్పటల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement