డిసెంబర్‌లో ఆకాశం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. పున్నమి వెన్నెల జాబిలి చూసిన తరువాత తక్షణమే ప్రకృతి ప్రేమలో పడిపోతాం. ఇంత అందాన్ని కనుల ముందుంచే ఈ నెలలోనే దగ్గు, జలుబు లాంటి లక్షణాలు కూడా అధికంగా కనిపిస్తుంటాయి. శీతగాలులతో వాతావరణ మార్పు కారణంగా మన శరీర ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకంగానూ ఇది నిలుస్తుంది. శీతాకాలంలో తన ఆరోగ్యం ఎలా కాపాడుకున్నారనేది నటి రష్మిక తన మాటల్లో చెప్పారు.
తన ఆరోగ్య రహస్యం గురించి రష్మిక మాట్లాడుతూ… సుదీర్ఘకాలం పాటు షూటింగ్‌లు చేయడంతో పాటుగా అత్యుత్తమ నటన కనబరచడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు. ఈ రద్దీ జీవితంలో తనకు ఆనందాన్ని కలిగించేది అందమైన డిసెంబర్ సాయంత్రాలేనన్నారు. ఎంతగా షూటింగ్‌లను ఆస్వాదించినా.. ఈ కాలంలో మాత్రం సులువుగా దగ్గు, జలుబు బారిన పడుతుంటానన్నారు. తనకు దగ్గు, జలుబు లక్షణాలు కనిపించిన ప్రతిసారీ తమ అమ్మ తనకు విక్స్‌వాపోరబ్‌తో ఆవిరి తీసుకోవడాన్ని అలవాటు చేశారన్నారు. విక్స్ వాపోరబ్‌లో ఉన్న కర్పూరం, యూకలిప్టస్, మెంథాల్ లాంటివి సాధారణ జలుబు, దగ్గు వంటి లక్షణాల నుంచి ఉపశమనం అందిస్తాయని ఆమె తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital