హైదరాబాద్ : భారత భవిష్యత్తుపై తనకు గల సానుకూల దృక్పథం వెనుక ఎన్నో బలమైన కారణాలున్నాయని, ఆర్థిక పునరుజ్జీవం నుంచి సాంకేతిక పురోగతి వరకు, చారిత్రక ప్రాధాన్యమున్న ఈ శకంలో భారత్ విషయంలో తాను చాలా బులిష్‌గా ఉన్నానని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీ అండ్ సీఈఓ విభా పడాల్కర్ అన్నారు. జీ20కి భారత్ అధ్యక్షత వహించడమనేది, ప్రపంచానికి మెరుగైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించే దిశగా మనకున్న విజన్, ప్రణాళికలను తెలియజేయడానికి ఒక చక్కని వేదికను అందిస్తోందన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే నిరంతర ఆవిష్కరణలతో అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగాల్లో టెక్నాలజీ రంగం కూడా ఒకటన్నారు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా చంద్రయాన్, మంగళ్‌యాన్ వంటి ఉత్కృష్టమైన ప్రాజెక్టులతో మనం అంతరిక్ష రంగంలోనూ భారీగా పురోగమిస్తున్నామన్నారు.
అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఎకానమీగా భారత్ ఉందన్నారు. పీపీపీ (కొనుగోలు శక్తి సారూప్యత) పరంగా అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఉందన్నారు. 2023లో ప్రపంచ ఎకానమీతో పోలిస్తే భారత వాస్తవ జీడీపీ వృద్ధి రేటు రెట్టింపు స్థాయిలో 5.9 శాతంగా (ఐఎంఎఫ్ అంచనాలు) ఉండగా, సంపన్న దేశాలతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా నమోదైందన్నారు. ఎకానమీలోని అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాలు పెరుగుతుండటం, విశ్వాస స్థాయిలు పెరుగుతుండటం, కార్పొరేట్ల ఆదాయాల్లో అధిక వృద్ధి స్పష్టంగా కనిపిస్తుండటం వంటి అంశాలన్నీ కూడా మనం నామినల్ జీడీపీ విషయంలోనూ జపాన్, జర్మనీలను దాటి 3వ ర్యాంకును సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని సూచిస్తున్నాయన్నారు. ఈవై రూపొందించిన ఇండియా100 నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్‌లో పనిచేసే వయస్సు గల వ్యక్తుల సంఖ్య 1.04 బిలియన్లుగా (104 కోట్లుగా) ఉండనుందన్నారు.
దీంతో పాటు డిపెండెన్సీ నిష్పత్తి 2030 నాటికి దేశ చరిత్రలోనే అత్యంత కనిష్టంగా 31.2 శాతంగా ఉండనుందన్నారు. ఓ వైపు ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా గల దేశంగా 140 కోట్ల మంది జనాభా మైలురాయిని భారత్ అధిగమించగా, మరోవైపు నగరాలకు మళ్లుతున్న వ్యక్తుల సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతోందన్నారు. ఆర్థిక పనితీరు మెరుగుపడుతుండటానికి పట్టణీకరణ దోహదపడుతోందన్నారు. సుస్థిర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంలో భాగంగా భారత్ ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను (డీపీఐ)ని అభివృద్ధి చేసిందన్నారు.