హైదరాబాద్ : దిగ్గజ టెలికం కంపెనీ అయిన వీ (వీఐ) తెలంగాణలోని తమ నెట్వర్క్ సామర్ధ్యాన్ని అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని 4,000 పైచిలుకు సైట్లలో ఎల్టీఈ 2500 ఎంహెచ్ జెడ్ బ్యాండ్‌లో స్పెక్ట్రంను 10 ఎంహెచ్ జెడ్ నుంచి 20 ఎంహెచ్ జెడ్ కి అప్‌గ్రేడ్ చేసింది.
తద్వారా ఈ లేయర్లో నెట్వర్క్ సామర్ధ్యాన్ని రెట్టింపునకు పెంచుకుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, అదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడా, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అప్‌గ్రేడ్‌తో వీ గిగానెట్ నెట్‌వర్క్‌పై కస్టమర్లు మరింత వేగవంతమైన డేటా స్పీడ్‌ను అనుభూతి చెందగలరు.
ఈసందర్భంగా వొడాఫోన్ ఐడియా క్లస్టర్ బిజినెస్ హెడ్ (ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కర్ణాటక) ఆనంద్ డానీ మాట్లాడుతూ… నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్‌గ్రేడ్ చేయడం, తమ యూజర్లకు మెరుగైన వేగం, విశ్వసనీయతను అందించాలన్న వీ విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఈ స్పెక్ట్రం అప్‌గ్రేడ్ చేపట్టబడిందన్నారు. ఇటీవల 900 ఎంహెచ్ జెడ్ బ్యాండులో కొనుగోలు చేసిన 2.4 ఎంహెచ్ జెడ్ ను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా రాబోయే రోజుల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవడాన్ని కొనసాగిస్తామని తెలిపారు.