Friday, November 22, 2024

వామ్మో డెంగీ: పంజా విసిరేందుకు రెడీగా దోమలు, యాక్షన్​ ప్లాన్​లో జీహెచ్ఎంసీ

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ : కొవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పడుతుంటే.. డెంగ్యూ ప్రతి సంవత్సరం జీహెచ్‌ఎంసీ పరిధిలో వణికించేందుకు రెడీ అవుతోంది. మహానగరంలో పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రతి ఏడాది వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదువుతుండటమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లిలో సైతం గతంలో వెయ్యికి పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అలాంటి పరిస్థితులు మహానగరానికి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు హైదరాబాద్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.

ఈనెల 16న జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. “దోమలను పుట్టనివ్వొద్దు.. దోమలను కుట్టనివ్వొద్దు’ అనే నినాదంతో దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు జనంలోకి వెళ్లేందుకు జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement