హైదరాబాద్ : ప్రసిద్ధ ఫ్రీ-టు-ప్లే ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్ అయిన వాలరంట్ హైదరాబాద్‌లో పెరుగు తున్న గేమర్లకు గేమింగ్ అనుభవాన్ని మెరుగు పరచడానికి టీమ్ డెత్‌మ్యాచ్ అనే కొత్త మోడ్‌ను పరిచయం చేసింది. కొత్త మోడ్ ఆటగాళ్లు వాలరంట్ గేమ్ ను సరదాగా, ఆకర్షణీయంగా ఆడేందుకు వీలు కల్పిస్తుంది. ఈసందర్భంగా రైట్ గేమ్స్ ఇండియా అండ్ సౌత్ ఆసియా కంట్రీ మేనేజర్ అరుణ్ రాజప్ప మాట్లాడుతూ… ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ అభిరుచి, ఉత్సాహం తమకు అద్భుతమైన ప్రేరణగా ఉన్నాయన్నారు. టీమ్ డెత్‌మ్యాచ్ వంటి ఉత్తేజకరమైన ఆటలను స్థానిక గేమర్‌లకు అందించడానికి ఈ ప్రాంతంలో పటిష్ఠమైన రైట్ బృందాన్ని రూపొందించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. తమ ఆటగాళ్లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
భారతదేశం, దక్షిణాసియాలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించడానికి తాము సంతోషిస్తున్నామన్నారు. రైట్ గేమ్స్ ఇండియా అండ్ సౌత్ ఆసియా మార్కెటింగ్ లీడ్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ… టీమ్ డెత్ మ్యాచ్ అత్యంత వేగవంతమైన స్వభావం అన్ని స్థాయిల అనుభవం, నైపుణ్యం కలిగిన గేమర్‌లను ఆకట్టుకునేలా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఈ గేమ్ మోడ్‌తో తమ లక్ష్యం ఏమిటంటే హైదరాబాద్‌లోని కొత్త, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు రివార్డింగ్, ఆనందదాయకంగా ఉండే కోర్ వాలరంట్ అనుభవం సరళమైన, యాక్సెస్ చేయగల వెర్షన్‌ను అందించడమన్నారు.