హైదరాబాద్: బహిరంగంగానే వసూళ్లకు పాల్పడుతున్న మంత్రి మల్లారెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు..గాంధీభవన్‌లో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వసూల్ మంత్రి ఆడియో టేపులు బయటకు వచ్చినా ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కెసిఆర్ ని ప్రశ్నించారు.. అలాగే డ్రగ్స్ కేసులో నలుగురు టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లు ఉన్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయని, వారిపై ఏం చర్యలు తీసుకున్నారంటూ నిలదీశారు… తెలంగాణ పరువు తీసిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు భూమి, ఇసుక, మద్యం డీల్ చేయగా ఇప్పుడు డ్రగ్స్ దందాలో కూడా వేలు పెట్టారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీతో మాట్లాడుకొని కేసును మాఫీ చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉందని, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్‌కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తిని పోటీలో పెట్టిందని వివరించారు. సాగర్‌కు నీళ్లు రావు.. ఎడారిగా మారుతోందనే విషయం ఓటర్లు గమనించాలని సూచించారు. టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సాగర్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని సందేహం వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ కర్ణాటకలో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారు అని నిలదీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement