పేద ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ స్థలాలను వినియోగించే విధంగా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో గల తన కార్యాలయంలో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ వెంగళ్ రావ్ నగర్, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంటలలో ఎన్నో సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారికి ఆ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం బేగంపేటలోని ప్రభుత్వ స్థలాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలెక్టర్ లతో కలిసి పరిశీలించారు. మంత్రి వెంట సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, తదితరులున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..