ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ‘ఆయుర్వేద – న్యూట్రిషనల్ సైన్స్‌తో సంపూర్ణ ఆరోగ్యం పొందడం’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా, న్యూట్రిషన్, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నితిక కోహ్లీ ఈ చర్చలో పాల్గొనగా, ఆర్‌జె షెజ్జీ ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించారు. ఈ చర్చలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని ప్యానలిస్ట్‌లు వెల్లడించారు. ఈసందర్భంగా సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ ట్రైనర్‌గా బాదముల ఆరోగ్య ప్రయోజనాలు గురించి తనకు తెలుసన్నారు. ప్రోటీన్‌లు అధికంగా కలిగిన బాదములను ఎన్నో సంవత్సరాలుగా తాను తన క్లయింట్స్‌కు సూచిస్తున్నానన్నారు. బరువు నియంత్రణకు ఇవి తోడ్పడతాయన్నారు. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం, భారతదేశంలో ఎంతోమంది తల్లుల్లా తాను తన సొంత వ్యవస్ధను అనుసరిస్తున్నానని తెలిపారు.
ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ నిఖిత కోహ్లీ మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం, నేటి సమాజంలో కుటుంబాలు ఆయుర్వేద విజ్ఞానాన్ని సమకాలీన న్యూట్రిషనల్ సైన్స్‌తో జోడించడం తప్పనిసరన్నారు. ప్రతి రోజూ గుప్పెడు బాదములు తినడం వల్ల కొంతకాలానికి ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. సంవత్సరాలుగా, బాదములు వల్ల ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. వాటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. న్యూట్రిషన్ – వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… చక్కటి ఆరోగ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనివ్వాలన్నారు. దీనికి చేయాల్సింది ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించడం, బాదముల లాంటి ఆహారం తీసుకోవడమన్నారు. బాదములతో బరువు నియంత్రించడం సాధ్యం కావడంతో పాటుగా దీర్ఘకాలిక జీవనశైలి సమస్యలు అయిన టైప్ 2 మధుమేహం, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు (సీవీడీ) వంటి వాటికి సైతం ఇవి తోడ్పడతాయన్నారు. తరచుగా బాదములను తినడం వల్ల బ్లడ్ షుగర్ కూడా నియంత్రించబడుతుందన్నారు.