హైదరాబాద్ లోని నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసంలో ఐవీఎఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో..హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, వివిధ రంగులను చల్లుతూ.. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ రంగుల వసంతోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ..రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈరోజు హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. సంతోషం, ఔన్నత్యం, ఉల్లాసం, ఆనందాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని సుఖ సంతోషాలు, శాంతి సౌఖ్యాలు నింపాలన్నారు. ఆనందకరమైన, సురక్షితమైన, రంగులతో హోలీ జరుపుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పండుగలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి పండుగను ఆనందోత్సాహాల మధ్య సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారన్నారు. పిల్లలు హోలీ ఆడేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రసాయనాలతో కూడిన హానికరమైన రంగులతో కాకుండా సాధారణమైన సహజసిద్ధమైన రంగులు, నీటితోనే అట్టహాసంగా హోళీ పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement